Jul 24,2023 16:58

ఢిల్లీ : గతేడాది రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన రిషభ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు, ఇషాంత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.''రిషభ్‌ పంత్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో బరిలోకి దిగడం కష్టమే. ఎందుకంటే అతడికేమీ చిన్న గాయం కాలేదు. అదొక భారీ ప్రమాదం. అతడు కోలుకుని బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, పరుగెత్తడం.. అంత తేలికేంకాదు. అయితే, పంత్‌ రెండో సర్జరీకి వెళ్లకపోవడం మంచిదైంది. అలా జరిగి ఉంటే మరింత కాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు కొద్దికొద్దిగా కోలుకుంటున్న పంత్‌ ప్రపంచకప్‌లో ఆడటం కష్టమే. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌ నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తే అద్భుతమే అవుతుంది'' అని ఇషాంత్‌ తెలిపాడు.