ప్రజాశక్తి - తాళ్లరేవు (కాకినాడ) : ఓఎన్జిసి సిఎస్‌ఆర్ నిధులతో మండలంలోని అంబేద్కర్ భవనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం తాళ్లరేవు అంబేద్కర్ భవనం రూ. 36 లక్షలతో నిర్మించనున్న పై అంతస్తుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బౌద్ధ ఉపాసకులు ఎడ్ల కుటుంబరావు, బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తో పూజలు చేయించారు. మండల పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, ఏ.ఎమ్. సి. చైర్మన్ కుడుపూడి శివ న్నారాయణ, జెడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, దున్న జనార్ధన రావు, కాశి లక్ష్మణస్వామి ,వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్, కొపనాతి నాగరాజు, స్థానిక సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి, రెడ్డి బాబు, పోలేకుర్రు, ఇంజరం, జార్జి పేట సర్పంచులు వెంటపల్లి నూకరాజు, ముద్దన వెంకట శివ రామ ప్రసాద్, పేర్ని ఆదినారాయణమూర్తి , నీలపల్లి మాజీ సర్పంచ్ రేవు మల్లీశ్వరి, వైసీపీ మండల అధ్యక్ష , కార్యదర్శులు కే.గోవింద్ కుమార్, ఆర్.గంగాధర్, స్థానిక ఎంపిటిసిలు, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.










