Oct 24,2023 21:35

న్యూఢిల్లీ : ఆకాశ ఎయిర్‌ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో ప్రయాణించడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం కొత్త విమానాలకు ఆర్డర్‌ పెట్టనున్నామని ఆ కంపెనీ సిఇఒ వినరు దూబే తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ దేశీయంగా 16 గమ్య స్థానాలకు సేవలందిస్తుందని.. 4.2 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రస్తుత ఆ సంస్థకు 20 విమానాలు ఉన్నాయి.