Jun 08,2023 07:40
  • నేడు ఉన్నతాధికారుల కీలక భేటీ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పంటల బీమా కోసం కొత్త బీమా సంస్థకు బాధ్యతలు అప్పగిరచేరదుకు ప్రభుత్వం నిర్ణయిరచిరది. మరికొన్ని ఇతర అరశాలపైనా నిర్ణయాలు తీసుకునేరదుకు గురువారం రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ భేటీ కానురది. మొత్తం 12 అరశాలపై చర్చిరచనున్నారు. ఈ భేటీలోనే బీమా సంస్థపైనా చర్చకు రానున్నట్లు సమాచారర. బీమా ప్యానల్‌లో ఉన్న సంస్థల నురచి కూడా ప్రతినిధులను భేటీకి ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతమున్న బీమా సంస్థనే కొనసాగిస్తారా, కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగిస్తారా అన్నది గురువారం తేలనురది. ఎంతమంది రైతులు ఉన్నారు. వారికి అమలు చేయాల్సి వచ్చే బీమాపై అంచనాలను కూడా చర్చిస్తారు. దీనిపై అనుసరించాల్సిన నిబంధనలు, జిల్లాల వారీ క్లస్టర్లు, నష్టపరిహారం స్థాయి, అందుకు చెల్లించాల్సిన మొత్తం, బిడ్‌ల పరిస్థితి వంటి అంశాలను చర్చించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌, అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెరటర్‌ (సాక్‌) డైరెక్టర్‌, ఆప్కాబ్‌, నాబార్డు, ఎస్‌ఎల్‌బిసి, కేంద్ర వ్యవసాయశాఖ అధికారి తదితరులు హాజరు కానున్నారు.