Apr 22,2023 16:33
  •  ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి 

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : గత కొన్ని సంవత్సరాలుగా పంటల దిగుబడిలో ఎగుడుదిగుడులుగా ఉన్నాయి. దిగుబడి సక్రమంగా రాక రైతులు మనోవేదన చెందుతున్నారు రకరకాల కారణం చేత దిగుబడి రాని పంటలకు పంటల భీమా పూర్తిస్థాయిలో రైతులకు అందజేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక కర్షక భవన్లో జరిగిన ఏపీ రైతు సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వెంకటేషులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం పత్తి, టమేటా, ఉల్లి ,మొక్కజొన్న, మిరప లాంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి దిగుబడి రాలేదు కొన్ని పంటలకు ప్రభుత్వము నీటిపారుదల ఉన్నటువంటి కి మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తానని చెప్పడం సరైనది కాదు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అనేక రకాల పంటలు వర్షాధారం మీదనే వేసేటువంటి పరిస్థితి ఉంది తెగుళ్ల వల్ల దెబ్బతిన్న పంటలు ఉన్నాయి. వర్షం అధిక వర్షము అకాల వర్షం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. వీటి వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం మిరప పంటకు రేటు బాగున్నప్పటికీ తెగులు వల్ల పంట దిగుబడి రాలేదు ఉల్లి పంట మొత్తం తెగులు వల్ల పంట దిగుబడి సక్రమంగా లేదు పండిన పంటకు రేటు కూడా లేకపోవడం, మొక్కజొన్న లాంటి పంటకు కత్తెర పురుగు తెగులు వల్ల దిగుబడి బాగా తగ్గింది పత్తి పంట నకిలీ విత్తనాలు వాతావరణం వీటన్నిటి వల్ల దిగుబడి కేవలం ఒకటి రెండు క్వింటాళ్లు మాత్రమే పరిమితం అయిపోయిన పరిస్థితి ఉంది, లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి దిగుబడి లేక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం పునరా ఆలోచన చేసి అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలనిప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఇతర సంఘాలను ఐక్యపరిచి పెద్ద ఉద్యమం చేపడతామని ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులను అన్ని రకాల ఆదుకుంటానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ ఒకవైపు అతివృష్టి అనావృష్టి పంటలు పెట్టుబడి ఖర్చులు నకిలీ విత్తనాల బెడద వంటి వాటితో రైతులు సతమత అవుతున్న పరిస్థితులలో నాలుగు లైన్లు రోడ్లు 6 లైన్లు రోడ్లు ఇంకారకరకాల పేర్లతో రైతుల భూములను సేకరిస్తున్నారు వాటికి తగిన నష్టపరిహారము చెల్లించడం లేదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములకు కేవలం లక్షలు మాత్రమే ఇచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారు. వీటిని కొత్తగా జిల్లాకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ పునరాల్లోచిన చేసి రైతులకు న్యాయం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమం ఈ సమావేశంలో సి హనుమంతు పి. హనుమంతు,కె.మల్లయ్య కోటకొండ సూరి, బొల్లవరం కృష్ణ, గార్గేయపురం మృత్యుంజయ పాల్గొన్నారు.