ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2023-27 (ఐడిపి-2023-27)ను ప్రకటించింది. 2023 ఏప్రిల్1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం నాలుగేళ్లపాటు అమల్లో ఉంటుంది. 2020-23 పారిశ్రామికాభివృద్ధి విధానం ముగియడానికి వారం రోజుల ముందే ఈ నూతన విధానానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత కలిగిన 12 రంగాలపై ఈ నూతన విధానం కేంద్రీకరించింది. జాతీయ, అంతర్జాతీయ ధోరణులను గమనంలో ఉంచుకుని రూపొందించిన ఈ ఐడిపిని టెక్స్‌టైల్స్ రంగాలకు సహా వివిధ రంగాలకు వర్తింపజేయనున్నారు. విదేశీ పెట్టుబడులు, ఉపాధి కల్పించే చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ వెంచర్లు, లాజిస్టిక్ హబ్‌లు, సేవల రంగం, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.
ఈ కొత్త విధానం ఆర్థిక వృద్ధికి తొమ్మిది మూల స్తంభాల గురించి నొక్కి చెప్పింది. పోర్టుల ఆధారిత అభివృద్ధి, లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ పేరిట కొత్తగా ఓడరేవుల నిర్మాణంపైనా దృష్టి సారిరచనున్నారు. పారిశ్రామిక వాడలను నిర్మిరచి పెట్టుబడులు పెట్టేవారు వెరటనే ఉత్పత్తి ప్రారంభిరచేలా చూడాలని, ప్లగ్ అరడ్ ప్లే విధానం కోసం అన్ని ఏర్పాట్ల్లు మురదుగానే చేయాలని నిర్ణయిరచారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'రెడీ టు ఆక్యుపై ఇండిస్టియల్ స్పేసెస్'ను పెంపొందించడం, మహిళలు, మైనార్టీలు, అణగారిన వర్గాలు అభివృద్ధిలో భాగస్వాములును చేసే పరిశ్రమలు, స్టార్టప్‌లను పటిష్టపరచడం వంటివాటికి అధిక ప్రాధాన్యమిస్తామని ఐడిపి పేర్కొంది. కొత్త పెట్టుబడులకు ఎలాంటి ఆటంకం లేకుండా త్వరిత గతిన అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ డెస్కులను వైఎస్‌ఆర్ ఎపి వన్ ద్వారా ఏర్పాటు చేస్తారు.
విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై - బెరగళూరు పారిశ్రామిక కారిడార్ పైనా ప్రత్యేక దృష్టి సారిరచాలని, దీనికి అనుసంధానంగా కొత్త పరిశ్రమలు వచ్చేలా చూడాలని ఐడిపి పేర్కొంది. మూలధన పెట్టుబడిపై మాత్రమే వంద శాతం ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అది ఏడాదికి 20 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయిరచారు. వీటితోబాటు బ్రౌన్‌ఫీల్డు ప్రాజెక్టులకు ఈ రాయితీలను 50శాతం, అంతకు మించి ఇవ్వొచ్చని పేర్కొంది. ఐడిపి కేంద్రీకరించిన కీలకమైన 12 రంగాల్లో కెమికల్స్, పెట్రో కెమికల్స్, ఫార్మాసుటికల్స్,బల్క్ డ్రగ్స్, టెక్స్‌టైల్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటి, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, వైద్య పరికరాలు, రక్షణస్త్ర, ఎయిరో స్పేస్, మెషినలరీ ఎక్విప్‌మెంట్, పునరుత్పాదక ఇంధనం, మానుఫాక్చరింగ్, బయోటెక్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటివి ఉన్నాయి.










