న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సానుకూల సంకేతాలనిచ్చింది. ప్రారంభసెషన్‌లో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా దూసుకుపోయి 61,110 కి చేరింది. సెన్సెక్స్ తొమ్మిది నెలల గరిష్టానికి ట్రేడవుతోంది. నిఫ్టీ 99.50 పాయింట్లు పెరిగి (0.5 శాతం) 18,111వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసినప్పటికీ.. ప్రారంభ ట్రేడ్‌లో ఆసియా షేర్లు లాభాలతో దూసుకెళ్లాయి. మరోవైపు బుధవారం వెలువడబోయే ఫెడ్ రేట్ల పెంపు నుంచి పెట్టుబడి దారులు సానుకూల ప్రకటనలను ఆశిస్తున్నాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ దిగిరావడం, కొన్ని కీలక కంపెనీల కార్పొరేట్ ఫలితాలు ఆశాజనకంగా ఉండడం కూడా సానుకూల అంశంగా కనిపిస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.77 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో డా.రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, ఎన్‌టిపిసి, ఎం అండ్ ఎం, సన్ ఫార్మా లాభపడగా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టి వెనబడ్డాయి.










