- సిగుల్, ట్రాఫిక్ విభాగాల్లోనే భర్తీకాని 77 వేల పోస్టులు
- మొత్తంగా 3 లక్షల పోస్టులు ఖాళీ
- రైల్వేశాఖ ఉద్యోగ నియామకాల్లో కేంద్రం మీనమేషాలు
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేల్లో భద్రతకు సంబంధించి వివిధ విభాగాల్లో సిబ్బందిని ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా రైల్వేలో కీలకమైన సిగుల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో 77 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేయలేదు. భారతీయ రైల్వేలో మూడు లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలను సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. 2022 డిసెంబరు 23న రాజ్యసభలో మంత్రి మాట్లాడుతూ 'దేశవ్యాప్తంగా రైల్వేల్లో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది' అని తెలిపారు. ఇందులో కీలకమైన సిగుల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో గణనీయమైన సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని చెప్పారు. సిగుల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో 14,815 ఖాళీలు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో 62,264 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా 87,654 పోస్టులు, మెకానికల్ విభాగంలో 64,346 ఖాళీలు, ఎలక్ట్రికల్ విభాగంలో 38,096 ఖాళీలు ఉనాుయనిమంత్రి తెలిపారు. కీలకమైన కార్యాచరణ విభాగాల్లో సిబ్బంది కొరత భారతీయ రైల్వేల సమర్థవంతమైన పనితీరుకుసవాల్‌గా నిలుస్తోంది. ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
- ప్రమాదం జరిగిన సౌత్ ఈస్టర్‌లో 17,811 ఖాళీలు
శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బహనగ బజార్ సౌత్ ఈస్టర్‌ు రైల్వే పరిధిలోకి వస్తుంది. మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ సౌత్ ఈస్టర్‌ులో 17,811 నాన్ గెజిటెడ్ పోస్టులు, 150 గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల ఖాళీల విషయంలో ఉత్తర రైల్వే జోన్‌లో అత్యధికంగా 39,226 ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ రైల్వే జోన్‌లో 30,785 ఖాళీలు ఉన్నాయి. తూర్పు రైల్వే జోన్‌లో 30,735, సెంట్రల్ రైల్వే జోన్‌లో 28,876 ఖాళీలు ఉన్నాయి. నైరుతి రైల్వే జోన్‌లో 6,638 ఖాళీలు ఉన్నాయి. భారతీయ రైల్వేలో మొత్తంగా ఎ, బి, సి గ్రూపుల్లో 3,15,780 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వేసిన వరస ప్రశులకు మంత్రి ఈ సమాధానాలు ఇచ్చారు. అలాగే, 2021-22లో గ్రూప్ ఎ, సిల్లో కేవలం 4,625 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఇదే సమయంలో 44,847 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు.
ఈ ఏడాదిలో సుమారు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైల్వే శాఖ హమీ ఇచ్చింది. 2020 నుంచి 2022 మధ్యకాలంలో సుమారు 3.5 కోట్ల మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. కేరళ ఎంపి అబ్దుల్ వహాబ్ అడిగిన ప్రశుకు మంత్రి సమాధానం ఇస్తూ 'వివిధ కేటగిరిల్లోని ఉద్యోగులను భర్తీ చేయాలనే డిమాండ్‌తో చత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సిఎస్‌ఎంటి) వద్ద ఉను డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ముందు నేషనల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సభ్యులు నిరసనకుదిగినట్లు' తెలిపారు. ఒక్క సెంట్రల్ రైల్వే జోన్‌లోనే నాన్ గెజిటెడ్ గ్రూప్ సి పోస్టులు 28,650 ఖాళీగా ఉన్నాయి. ఇందులో భద్రతా విభాగం పోస్టులే 14,203 ఉనాుయి. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో మొత్తంగా భారతీయ రైల్వేల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. 2019-20లో భారతీయ రైల్వేలో మొత్తంగా 12,35,900 ఉద్యోగులు ఉండగా, 2020-21 నాటికి ఈ సంఖ్య 12,33,700కు తగ్గిపోయింది.










