Aug 24,2023 11:57

 సిమ్లా :    హిమాచల్‌ప్రదేశ్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కులు జిల్లాలో గురువారం ఉదయం భారీగా కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. దీంతో భారీగా దుమ్ము ఎగిసిపడింది. అయితే అప్రమత్తమైన అధికారులు రెండు రోజుల ముందుగానే ఆప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. భవనాల  శిథిలాల కింద ప్రమాదవశాత్తూ ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని, వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వివరించారు. ఇప్పటికే అక్కడికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు  అక్కడికి చేరుకున్నాయని చెప్పారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కులులి-మండి హైవే దెబ్బతింది. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కులు- మండిని కలిపే రహదారి దెబ్బతింది. ప్రత్యామ్నాయ రహదారి పండోహ్  కూడా దెబ్బతిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతానికి ట్రాఫిక్‌ను నిలిపివేశామని సీనియర్‌ కులు పోలీస్‌ అధికారి సాక్షి వర్మ తెలిపారు. వర్షాకాల సీజన్‌ ప్రారంభమైనప్పటి నుండి భారీ వర్షాలతో మొత్తం 709 రహదారులు

అయితే ఈ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (ఐఎండి) రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.