ప్రజాశక్తి-చందర్లపాడు : సిపిఎం చందర్లపాడు మండల కమిటీ ఆధ్వర్యంలోని చందర్లపాడు మెయిన్ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్.కె హస్సాన్ సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి జరిగింది. పీడిత ప్రజల ప్రియతమ నేత భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య యొక్క ఆశయాలతో యువత ముందుకెళ్లాలని కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన పేదలు రైతుల కోసం అనేక పోరాటాలు తెలంగాణ సాయుధ పోరాటాలు నిర్వహించారు. మొట్టమొదటగా వ్యవసాయ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి కూలి రేట్లు కోసం పోరాటం నిర్వహించిన మహా నాయకుడు సుందరయ్య అని తన యావదాస్తి మొత్తం కూడా పేదలకు అంకితం చేసిన మహా నాయకుడు సుందరయ్య అని కొనియాడారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు సిపిఎం మండల కమిటీ సభ్యులు కె సీతారావమ్మ, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి సందిపోగు లింగయ్య, ఏపీఓ వెంకటేశ్వరరావు, ఉద్దండు సాహెబ్, దేవళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










