May 17,2023 15:21

ప్రజాశక్తి-గొల్లపూడి : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు యన్టీఆర్ జిల్లా ఉపాధి హామీ పథకం పి.డి ఆఫీసు గొల్లపూడి వద్ద జరిగిన ధర్నా జరిగింది. ఈసందర్భంగా యన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విస్సంపలి నాగరాజు అద్యక్షతన ధర్నా ను  ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏటేటకు ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో కేటాయింపు తగ్గిస్తూ పేదల కడుపు కొడుతున్నది. గత సంవత్సరం బడ్జెట్ 89 వేల కోట్లు ఉండగా, 2023 బడ్జెట్లో 60 వేల కోట్లకు కుదించడం పేదల కడుపు కొట్టడమే అని ఆయన ఖండించారు. అలాగే ఆహార భద్రత కోసం గత సంవత్సరం బడ్జెట్ లో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఉండగా ప్రస్తుత 2023 బడ్జెట్ లో ఒక లక్ష 97 వేల కోట్లకు కుదించడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పనిలో అనేక సౌకర్యాలు కూలీలకు ఉండేవని ఇప్పుడు అవన్నీ కూడా ఇవ్వట్లేదని ఆయన అన్నారు రెండు పూటలా పని రద్దు చేయాలని, సమ్మర్ అలవెన్స్ 40 శాతం ఇవ్వాలని,లేకుండా చేసిందని చేసిందని వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పని దినాలు చూపించాలని గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఉపాధి హామీ కల్పించాలని పనిచేసే చోట కనీస సౌకర్యాలైన మంచినీరు మెడికల్ కిట్లు లేవని పలుకు పారకు గతంలో డబ్బులు ఇచ్చే వారిని ఇప్పుడు అవి లేవు సానబడటానికి డబ్బులు లేవని అధికారులు చెబుతే పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ఐసి సాఫ్ట్వేర్ పేరుతో ఆన్లైన్ మచ్చలు విధానాన్ని తీసుకొచ్చి కూలీలు కడుపు కొడుతున్నారని మెట్లు వ్యవస్థ ఉండగా సాఫ్ట్వేర్ పేరుతో మెట్లు వ్యవస్థకు నిర్వీర్యం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ మాట్లాడుతూ
ఉపాధి హామీ చట్టం అమలు కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని,ఈ పథకం ను సమర్థవంతంగా అమలు చేయాలని  కోరుతూ ఎన్టీఆర్ జిల్లాలో 16 గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో మూడు దళాలుగా పని ప్రదేశాల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగినది ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను పి.డి దృష్టికి తీసుకువస్తున్నాము సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు.
1) వారం లో ఆరు రోజులు పనిచేస్తే మూడు, నాలుగు రోజులకు బిల్లు జనరేట్ అవుతుంది మిగతా రోజులని పని దినాల్లో యాడ్ చేయాలి. 
2) వారంలో చేసిన పనికి ఎంత పడుతుందో ఎవరికీ తెలియటం లేదు ఫే స్లిప్ లు ఇవ్వాలి.
 3) డిమాండ్ ఫారంలో పనికి వస్తానని పేరులు వచ్చినవారు ఆ వారం పనికి రాకపోతే తర్వాత వారంలో పని చేయించాలి
4) డిమాండ్ ఫారం లోని పేర్లు తెలుగులోనే ఇవ్వాలి.
5) సిగ్నల్ లేక యాప్లు పనిచేయటం లేదు మాన్యువల్ మచ్చర పద్ధతిని కొనసాగించాలి 
6) రెండు పూట్ల ఫోటో సిష్టమును రద్దు చేయాలి రెండు పూటలా పని విధానం రద్దు చేయాలి 
7) 2021,2022,2023 బకాయిలను చెల్లించాలి 
8) కనీస సౌకర్యాలు టెంటు మెడికల్ తిట్లు పలుగు పారలు ఇతర సౌకర్యాలు కల్పించాలి 
9) అకౌంట్ ఆధార్ లింకు పేరుతో బ్యాంకులు చుట్టూ తిప్పకుండా ఉపాధి హామీ ఆఫీసులోనే జాబు కార్డు ఆధారంగా ఒక ప్రతినిదిన పెట్టాలి 
10) కూలీల కు ఓర్పుగా, నేర్పు గా వారికి అర్థమయ్యేలా సమాధానం చెప్పాలి 
11) మెట్లు వ్యవస్థ సమర్థవంతంగా అమలు కోసం వారి అవగాహన కోసం మండల స్థాయి,గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలి
12) కొన్ని ప్రాంతాలలో బయట వ్యక్తులను, వాలంటీర్లు, పెట్టి ఫోటోలు మచ్చలు వేయిస్తున్నారు వారితో కాకుండా మెట్లతో మచ్చలు వేయించాలి
13) వంద రోజులు పనులు పూర్తయ్యే వరకు పనులు కల్పించాలి
 14) వంద రోజులు పూర్తయిన వారికి అదనంగా పని దినాలు కల్పించాలి 
15) కనీస వేతనం ఖచ్చితంగా 2 72 రూపాయలు ఇవ్వాలి,  16)కనీస వేతనం 500 రూపాయలకు పెంచాలి 
17) ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా పని ఒకేసారి కల్పించాలి 
18) ఉపాధి హామీని పాత పద్ధతిలోనే కొనసాగించాలి 
19) జాబు కార్డులు కొంతమందికి తొలగించారు.పెళ్ళైన ప్రతి కుటుంబానికి కొత్త కార్డులు ఇవ్వాలి
 20) దూర ప్రాంతాలకు ఆటో పైన వెళ్లి పనిచేసే వారికి ఆటో చార్జీలు 50 రూపాయలు ఇవ్వాలి
పైన తెలిపిన సమస్యలు పరిష్కారం కోసం కృషిచేసి కూలీలు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు 
 ఉపాధి హామీ, మెట్లు కూలీలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగిందని వీటి పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాలెం ఆనందరావు, భుఖ్యా జమలమ్మ, రైతు సంఘం నాయకులు ఆంజనేయులు సంఘీభావం తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తాళ్లూరి నరసింహారావు శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏసు పాదం ,రుక్మిణమ్మ, మోహనరావు, తదితరులు మెట్లు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యలతో కూడిన పత్రాన్ని పిడి గారికి అందజేయటం జరిగింది ఆమె మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారంకు నా వంతు కృషి చేస్తానని ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని ఆమె అన్నారు.