Jul 22,2022 16:26

ప్రజాశక్తి-నందిగామ: ప్రజాశక్తి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్న కృషిని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కొనియాడారు శుక్రవారం నందిగామ వైసిపి కార్యాలయంలో ప్రజాశక్తి ప్రచించిన నందిగామ ఎమ్మెల్యే మూడేళ్ల పాలన మరియు జన్మదిన ప్రత్యేక సంచికను నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అక్షరం ప్రజల పక్షం, నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజాశక్తి పత్రిక కృషి ఎంతో ఘనమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు అమర్లపూడి కీర్తి సౌజన్య వైసిపి నాయకులు సినిమాలు చైతన్య కుమారు కో ఆప్షన్ సభ్యులు దాసు నందిగామ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు, నందిగామ సొసైటీ అధ్యక్షుడు పాములపాడు రమేష్ వైసిపి నాయకులు మస్తాన్ కౌన్సిలర్ యాకూబ్ కరీముల్లా నల్లమల్ల మురళి తదితరులు పాల్గొన్నారు.