న్యూఢిల్లీ : కొవిన్ పోర్టల్ నుండి పెద్ద ఎత్తున డేటా లీకయిందని వచ్చిన వార్తలపై తక్షణమే విచారణ జరపాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్న కొవిన్ పోర్టల్ నుండి ఆధార్ కార్డు నెంబర్లతో సహా ప్రజల వ్యక్తిగత సమాచారం లీకైనట్లు వార్తలు వచ్చాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, పైగా భారతీయుల ప్రాధమిక హక్కుగా సుప్రీం కోర్టు ప్రకటించిన గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
గతంలో ఇటువంటి ఆరోపణలే రాగా, 2021 జూన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అయినప్పటికీ కొవిన్ వ్యవస్థ నుండి లీకేజీ జరిగిందను ఆరోపణలపై సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ హ్యాకింగ్ గ్రూపైన కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్‌తో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తు వివరాలు ఇంకా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై కూలంకషంగా దర్యాప్తు జరగాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. భారతీయుల వ్యక్తిగత సమాచార భద్రతలో జరిగిన ఇంత తీవ్ర ఉల్లంఘనకు బాధ్యులైన వారినిగుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
- టెలిగ్రామ్‌లో కొవిన్ పోర్టల్ లీక్!
- డేటా సురక్షితం : కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిన్ పోర్టల్ టెలిగ్రామ్‌లో లీకైంది. కొవిడ్ -19 వ్యాక్సిన్ డోస్‌లను పొందేందుకు కేంద్రప్రభుత్వం ఈ పోర్టల్‌లో దేశ ప్రజల సమాచారానిు నిక్షిప్తం చేసింది. ఈ పోర్టల్‌లో సమాచారం లీక్ కావడంతో ప్రజల ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ సమాచారం, పాస్‌పోర్ట్ నెంబర్ సహా పుట్టిన తేదీ, వ్యాక్సిన్ పొందిన ప్రాంతం తదితర సమాచారం మొత్తం లీకైనట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ ఎనిు డోసులు తీసుకునాురను సమాచారంతోపాటు ఫోన్ నెంబర్లు కూడా లీకయ్యాయి. ఫోన్ నెంబర్‌కు బదులుగా ఆధార్ నెంబర్‌ను నమోదు చేసినప్పటికీ ఈ వివరాలు మొత్తానిు పొందవచ్చని మొదటగా మలయాళ వెబ్‌సైట్ ది ఫోర్త్ న్యూస్ నివేదించింది. ఎవరు యాక్సెస్ చేసినా సమాచారం అందుబాటులోకి వచ్చే విధంగా ఉంది.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కాంగ్రెస్ నేతలు కెసి. వేణుగోపాల్, జైరాం రమేష్, పి. చిదంబరం, టిఎంసి నేత డెరెక్ ఒ బ్రెయిన్, ఇండియా టుడే జరులిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి, మోజో స్టోరీకి చెందిన బర్ఖా దత్ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది. రాజేష్ భూషణ్ నెంబర్‌ను నమోదు చేసినప్పుడు ఉత్తరాఖండ్‌లోని కోటి ద్వార్ ఎమ్మెల్యే అయిన ఆయన భార్య రీతూ ఖండూరీ వ్యక్తిగత వివరాలతోపాటు ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, చివరి నాలుగు అక్షరాలతోసహా వివరాలు వెల్లడయ్యాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2021 జూన్ 12న కొవిన్ పోర్టల్‌ను హ్యాక్ చేసి, 15 కోట్ల మంది డేటాబేస్‌ను విక్రయించినట్లు నివేదికలు వెల్లడైనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అయినప్పటికీ ఆరోపణలపై సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ హ్యాకింగ్ గ్రూపైన కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్‌తో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తు వివరాలు ఇంకా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు.
- దర్యాప్తు చేస్తున్నాం : కేంద్రం
డేటా లీక్ వార్తలను దర్యాప్తు చేస్తున్నామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి)నికేంద్రం కోరింది. డేటా లీక్ వార్తలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఖండించింది. 'ఇవన్నీ నిరాధార వార్తలు. కోవిన్ పోర్టల్‌ను అన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందించాం. ఒటిపి అథెంటికేషన్‌తో మాత్రమే ఇందులోని డేటాను చూడగలం' అని పేర్కొంది. ఒటిపి లేకుండా కొవిన్ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్ చేయలేమని తెలిపింది.










