26న సమ్మెను జయప్రదం చేయాలని విస్తృత సమావేశాలు, ప్రచారాలు
అధికారులకు, యాజమాన్యాలకు కార్మికుల సమ్మె నోటీసులు
ప్రజాశక్తి - విలేకర్ల యంత్రాంగం : తాడేపల్లి మండలం పెనుమాకలో అంగన్వాడీ లతో పాటు వివిధరంగాల్లో పని చేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఎపి అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.కామేశ్వరి, నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ 26న సమ్మెలో అన్ని రంగాల కార్మికులతో పాటు అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపిచ్చారు. దుగ్గిరాల ఎఎంసి మార్కెట్ యార్డులో గురువారం సెస్సు రద్దుకు వ్యతిరేకంగా పసుపు ముఠా కార్మికుల సమావేశం మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు గుంటూరు తూర్పు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పసుపు యార్డులోనే పసుపు క్రయ విక్రయాలు జరపాలన్నారు. రైతు సంఘం జిల్లా నాయకులు కంచుమాటి అజరుకుమార్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి, జిల్లా కార్మిక సంఘం నాయకులు జంపాల శ్రీమన్నారాయణ, ప్రొఫెసర్ లలితానందప్రసాద్, న్యాయవాది స్టాలిన్ మాట్లాడారు. అనంతరం ఎఎంసి యార్డు చైర్మన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి విద్యార్థి కోచింగ్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో సిఐటియు గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతు దేశంలో ఉన్న కోట్లాది కార్మికులు హక్కులు హరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సమ్మెని జయప్రదం చేయాలని పిలుపిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కె శరత్‌బాబు, సిఐటియు రేపల్లే డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్, పల్లపట్ల ప్రాజెక్టు కార్యదర్శి ఎస్ అరుణ, ఆశాలు, ఆటో, ముఠా, భవననిర్మాణ, పంచాయతీ రంగాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం మండలంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. భట్టిప్రోలు పద్మశాలియ కళ్యాణ మండపంలో సమ్మె సన్నాహక సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ ప్రసంగించారు. నాయకులు వి వెంకట్రామయ్య, జి సుధాకర్,ఎం సత్యన్నారాయణ, పి రమాదేవి పాల్గొన్నారు. నిజాంపట్నంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ సమావేశంల నిర్వహించారు. మేడికొండూరులో ప్రజాసంఘాల మండల కన్వీనర్ బొట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. తెనాలి స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో సమ్మె జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్‌వలి, ఎం మరియమ్మ పాల్గొన్నారు. వినుకొండలో సిపిఎం కార్యాలయంలో విస్తృత సమావేశంలో గుంటూరు పశ్చిమజిల్లా సిఐటియు నాయకులు డి శివకుమారి ప్రసంగించారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెటిల్డా దేవి, సిఐటియు డివిజన్ అధ్యక్షులు కె హనుమంత్ రెడ్డి, నాయకులు ఎం తిరుమల లక్ష్మి ప్రసంగించారు. సత్తెనపల్లిలో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సత్తెనపల్లి మండల అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశంల సిఐటియు పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకుని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులు, పేద ప్రజలు రైతు వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజలంతా ఐక్య పోరాటాలు చేయాలని, 26న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు గుంటూరు మల్లేశ్వరి, పెండ్యాల మహేష్ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో ఎల్‌ఐసి కార్యాలయంలో కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి సిపిఎం కార్యాలయంలో రూరల్ మండలం సమావేశం సిపిఎం నాయకులు ఎం పకీరయ్య అధ్యక్షతన నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె వి రాఘవులు పిలుపిచ్చారు. అనంతరం సమ్మెకు సంబంధించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సిపిఎం నాయకులు భీమిరెడ్డి కోటేశ్వరి, పి ప్రసాద్, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.చుండూరులో సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు సమావేశంలో నాయకులు కె బాబుప్రసాద్ ప్రసంగించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్, సీఐటీయూ నాయకులు శ్రీమన్నారాయణ, సావిత్రి, శివపార్వతి, దేవమణి పాల్గొన్నారు.
అధికారులకు సమ్మె నోటీసులు అందజేత
గుంటూరులో సంగడిగుంటలోని ఫ్యాక్టరీస్ ఏరియాలో సమ్మె నోటీసు అందజేశారు. ట్రాన్స్‌పోర్ట్, స్టీలు కంపెనీలు, ఐస్ క్రీమ్, ఫర్టిలైజర్స్ కంపెనీల్లో నోటీసులు ఇచ్చారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్నా ఆర్‌పిలు మెప్మా కార్యాలయ ఏఒకు సమ్మె నోటీసు అందచేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, నాయకులు శ్రీనివాసరావు, మాబు ఆర్‌పిల సంఘం జిల్లా అధ్యక్షులు అచ్చమాంబ, హసీనా పాల్గొన్నారు. రాజుపాలెంలో ప్రాధమిక వైద్యాధికారి భువనేశ్వరికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ ఆంజనేయులు నాయక్, ఆశవర్కర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. క్రోసూరులో గ్రామపంచాయతీ కార్యదర్శికి గ్రామపంచాయతీ సంఘం, సిఐటియు నాయకులు యు మురళి, సుబ్బారావు, వెంకటరమణ, నాగేంద్రమ్మ సమ్మె నోటీసు అందజేశారు. వినుకొండలో ఐసిడిఎస్ సిడిపిఒకు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెనోటీసు ఇచ్చారు. మంగళగిరిలో ఐసిడిఎస్ అధికారికి సిఐటియు నాయకులు వి దుర్గారావు, ఎస్‌ఎస్ చెంగయ్య, టి రాధ, చేనేత కార్మిక సంఘం నాయకులు పి బాలకృష్ణ సమ్మె నోటీసు అందజేశారు. పెదనందిపాడులో మండల వైద్యాధికారికి ఆశాలు సమ్మె నోటీసు అందజే శారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, నాయకులు ఆదినారాయణ, రైతుసంఘం నాయకులు కె శివనాగేశ్వరరావు, రిటైర్ పెన్షనర్స్ నాయ కులు జంపని రామారావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాణి, సౌందర్య, భాగ్యలక్ష్మి సమ్మె నోటీసు అందజేశారు. నరసరావుపేట మున్సిపల్ కార్యాల యంలో ఇన్‌ఛార్జి మేనేజర్ మహేష్‌కు సమ్మె నోటీసు అందజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి సిఐటియు నాయకులు షేక్ సిలార్ మసూద్ మాట్లాడారు.










