Feb 05,2021 09:11

శ్రీకాకుళం : కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ.. ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టనున్నామని సిఐటియు ప్రకటించింది. శుక్రవారంలోని రాజాంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌. రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ నుండి మున్సిపల్‌ కార్మికులను మినహాయించి, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 15 న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.