ఇంటర్నెట్‌డెస్క్ : ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉంటుందా? నీరసంగా ఉండి.. పని చేసుకోలేకపోతున్నారా?! ఈ అలసటకి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ అలసట సమస్య నుంచి బయటపడాలంటే ఓజూ ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందామా..!
విటమిన్ డి : శరీరంలో విటమిన్ డి లోపిస్తే అలసట వస్తుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి తగ్గితే.. ఎముకల్లో నొప్పి, కీళ్లనొప్పులు మొదలవుతాయి. దీంతోపాటు డిప్రెషన్ కూడా పెరుగుతుంది. అందుకే విటమిన్ డి లోపించకుండా చూసుకోవడం మంచిది.
ప్రొటీన్ : శరీర కణజాలాలను తయారు చేయడానికి ప్రోటీన్ అవసరం. పాలు, సోయాబీన్స్, మాంసంలో ప్రోటీన్ లభిస్తుంది. తప్పనిసరిగా ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి.
కాల్షియం : ఎముకలు, దంతాలతో పాటు, కండరాలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కాల్షియం చాలా అవసరం. అలాగే పెరుగుతున్న పిల్లలకు కాల్షియం అవసరం. పాలు, పెరుగు, జున్ను, పాలకూర, బ్రోకలీ, సోయాబీన్‌లలో కాల్షియం ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.
ఫైబర్ : యాపిల్స్, బేరి, ఓట్స్, తణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తినాలి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ మెండుగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
ఐరన్ : శరీరంలో రక్తాన్ని తయారు చేయడంలో, అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. తణధాన్యాలు, బీన్స్, గింజలు, దానిమ్మ, ఆకుకూరలు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు అని వైద్యులు చెబుతున్నారు.
అలసటను నివారించడానికి మరికొన్ని విషయాలు
తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలతో ఆహారాన్ని సిద్ధం చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.
పచ్చి కూరగాయలను కాల్చడం లేదా అతిగా ఉడికించడం మానుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్‌లో ఎప్పుడూ బ్రెడ్, బటర్, పరోటాలు తినడం మానుకోవాలి. ఉదయమే వాటిని తింటే జీర్ణవ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే వాటిని తినకూడదు.
కూరగాయలు, ఓట్ మీల్, పెరుగు, మొలకెత్తిన గింజలు మొదలైన వాటిని కూడా తీసుకోవాలి. ఇది శరీరానికి సరిపడా పోషణను అందిస్తుంది.
కూరగాయలు ఉడకబెట్టిన తర్వాత, ఆ నీటిని కూడా వాడండి. మరిగే సమయంలో, నీటిలోని 5 నుండి 55 శాతం పోషకాలు నీటిలో కరిగిపోతాయి. మీకు అల్పాహారం తినడానికి సమయం లేకపోతే, ఖచ్చితంగా తక్కువ మొత్తంలో వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పులను తినండి. తాజా పండ్లు, కూరగాయలు తినండి.