మియామి : రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయానిు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. కాగా న్యాయ శాఖ మాత్రం ఇంతవరకుఈ వార్తలను ధృవీకరించలేదు. వైట్‌హౌస్‌ను ఖాళీ చేసే సమయంలో ట్రంప్ పెద్ద మొత్తంలో రహస్య పత్రాలను ఫ్లోరిడాలోనితన ఎస్టేట్‌కుతరలించారనిఆరోపణలు ఎదుర్కొనాురు. ఈ కేసులో తాజాగా అభియోగాలు నమోదు కావడంతో వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎనిుకల్లో ట్రంప్ పోటీపై అనుమానాలు తలెత్తుతునాుయి. కాగా సిట్టింగ్ లేదామాజీ అధ్యక్షుడు ఇలా అభిశంసనలు ఎదుర్కొనడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. న్యాయ శాఖ వెంటనే ఈ వార్తలను ధృవీకరించకపోయినా ఆ విభాగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏడు క్రిమినల్ కౌంట్లపై ట్రంప్‌పై అభియోగాలు నమోదైనట్లు తెలిపారు. ట్రంప్‌పై నమోదైన ఈ అభియోగాలు రుజువైతే ఆయనకుపలు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు వునాుయి. వచ్చే మంగళవారం కోర్టుకుహాజరు కావాల్సిందిగా తనకుసమన్లు అందాయనిట్రంప్ తెలిపారు. తాను అమాయకుడిననిఒక వీడియోలో ట్రంప్ ప్రకటించారు. తనపై సాగే ఈ దర్యాప్తు కేవలం తనను వేధించడానికి ఉద్దేశించిందేననివిమర్శించారు. ఈ విషయం వెల్లడించిన 20నిముషాల వ్యవధిలోనే ట్రంప్ తన అధ్యక్ష ఎనిుకల ప్రచారానికి నిధుల సేకరణ ప్రారంభించారు. ఇప్పటికే సినీ నటికి డబ్బులు చెల్లించారనిఆరోపణలు ఎదుర్కొను కేసులో ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. అత్యంత రహస్యమైనవిగా వర్గీకరించబడిన పత్రాలను వందలాదిగా ఫ్లోరిడాలోనిట్రంప్ ఎస్టేట్‌లో దాచి వుంచడంపై నెలల తరబడి దర్యాప్తు సాగింది. వాటినిప్రభుత్వ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయతాులను ట్రంప్ అడ్డుకునాురా లేదాఅనే విషయమై కూడా దర్యాప్తు జరిగింది.










