Mar 01,2023 11:45

లాగోస్‌  :   అధికారిక పార్టీ అభ్యర్థి బోలా టినుబు (70) నైజీరియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నైజీరియా ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా పేరుగాంచిన టినుబు 24 మిలియన్ల ఓట్లలో 36 శాతం సాధించినట్లు స్వతంత్ర జాతీయ ఎన్నికల సంఘం (ఐఎన్‌ఇసి) పేర్కొంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఉపాధ్యక్షుడు అతికు అబుబకర్‌, ప్రతిపక్ష అభ్యర్థి పీటర్‌ ఒబిలపై బోలా టినుబు విజయం సాధించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు ముహమ్ముదు బుహారీని వ్యతిరేకించినప్పటికీ అదే పార్టీకి చెందిన టినుబును ప్రజలు గెలిపించారు. పీటర్‌ ఓబి, మాజీ ఉపాధ్యక్షుడు అతికు అబూకర్‌లు ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించారు. ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తామని.. నూతన ఎన్నికల కమిషనర్‌ కింద మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసినట్లు మీడియా తెలిపింది.