మహిళల సింగిల్స్ ఫైనల్ శనివారం జరగనుంది. టాప్‌సీడ్ ఇగా స్వైటెక్(పోలండ్), కరోలినా ముఛోవా(చెక్ రిపబ్లిక్)ల మధ్య ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సంగ్రామం జరగనుంది. గురువారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీస్‌లో ఇగా స్వైటెక్ 6-2, 7-6(9-7)తో హడ్డాడ్ మయాను ఓడించింది. వీరిద్దరు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో తలపడడం ఇదే ప్రథమం. ఇగా స్వైటెక్ 2020, 22లో ఫ్రెంచ్ ఓపెన్ 2022లో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గింది.










