Jun 08,2023 22:10

న్యూజిలాండ్‌ బోర్డుతో కాంట్రాక్టును వదులుకున్న పేసర్‌
వెల్లింగ్టన్‌: సీమర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుతో కాంట్రాక్టును వదులుకున్నాడు. గత ఏడాదీ బోర్ట్‌తో కాంట్రాక్టు కుదుర్చుకోని బౌల్ట్‌.. అక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడతానని ప్రకటించాడు. కాంట్రాక్టు నుంచి వైదొలగడంతో బౌల్ట్‌.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన లీగ్‌ బిగ్‌బాష్‌లో ఆడగలిగాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌బోర్డు గురువారం ఓ ప్రకటనలో అతడు సాధారణ ఆటల ఒప్పందంపై మాత్రమే సంతకం చేశాడని పేర్కొంది. ఐసిసి వన్డే జట్టు కెప్టెన్‌గా టిమ్‌ సౌథీ కొనసాగుతాడని, బౌల్ట్‌-సౌథీ కలిసి పేస్‌ భారాన్ని మోస్తారని బోర్డు ఆ ప్రకటనలో వెల్లడించింది. 33ఏళ్ల బౌల్ట్‌ టెస్టుల్లో 317, వన్డేల్లో 187వికెట్లతోపాటు టి20ఫార్మాట్‌లో 74వికెట్లు తీసి ప్రపంచచ అత్యుత్తమ వన్డే బౌలర్లలో ఒకనిగా రాణిస్తున్నాడు.
కాంట్రాక్టు కుదుర్చుకున్న ఆటగాళ్ల జాబితా..
ఫిన్‌ అలెన్‌, టామ్‌ బ్లండెల్‌, మిఛెల్‌ బ్రాస్‌వెల్‌, మార్క్‌ ఛాప్మన్‌, డెవన్‌ కాన్వే, లోక్కీ ఫెర్గ్యుసన్‌, హెన్రీ, జెమీసన్‌, లాథమ్‌, మిల్నే, మిఛెల్‌, నికోలస్‌, ఫిలిప్స్‌, సాంట్నర్‌, ఇష్‌ సోథీ, టిమ్‌ సౌథీ, టిక్నెర్‌, వాగర్‌, విలియమ్సన్‌, యంగ్‌.