Jun 09,2023 22:07


కొలంబో: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ను నేరుగా అర్హత సాధించడంలో విఫలమైన శ్రీలంక జట్టు త్వరలో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. క్వాలిఫయింగ్‌ ఆడే 15మంది జట్టును ప్రకటించిన శ్రీలంక జట్టులో సీనియర్‌ బ్యాటర్‌ అంజెలో మాథ్యూస్‌ చోటు దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో ఐపిఎల్‌ రాణించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ యువ స్పిన్నర్‌ పథీరణకు చోటు దక్కించుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఐపిఎల్‌ ట్రోఫీ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన పథీరణ ఆ లీగ్‌లో 19వికెట్లతో సత్తా చాటాడు. 20ఏళ్ల పథీరణ జూనియర్‌ మలింగగా పేరు పొందాడు. 15మందితో కూడాన జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు త్వరలో జింబాబ్వే వేదికగా జరిగే క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడనుంది.
జట్టు: దసున్‌ శనక(కెప్టెన్‌), కుశాల్‌ మెండీస్‌, కరుణరత్నే, నిస్సంక, అసలంక, ధనుంజయ, సమరవిక్రమ, హసరంగ, కరుణరత్నే, ఛమీర, రజిత, కుమార, తీక్షణ, పథీరణ, హేమంత.