Jun 10,2023 22:09

లండన్‌: జపాన్‌కు చెందిన టకిటో ఒడ్డా వీల్‌ఛైర్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో టకిటో 6-1, 6-4తో బ్రిటన్‌కు చెందిన ఆల్ఫీ హెవిట్‌పై నెగ్గాడు. దీంతో 17ఏళ్లకే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి వీల్‌ఛైర్‌ ఛాంపియన్‌గా జపాన్‌కు చెందిన టకిటో రికార్డు నెలకొల్పాడు.
బాలికల ఛాంప్‌ కొర్నీవా..
ఫ్రెంచ్‌ ఓపెన్‌ బాలికల టైటిల్‌ను రష్యాకు చెందిన 15ఏళ్ల అలీనా కొర్నీవా గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3వ సీడ్‌ కొర్నీవా 7-6(7-4), 6-3తో 6వ సీడ్‌ లూసియానా పెరేజ్‌ అలెర్నోన్‌పై విజయం సాధించింది. కొర్నీవా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ బాలికల టైటిల్‌ను గెలిచింది.