May 08,2023 16:12

ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. అందుకే నేటికాలంలో చాలామంది ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామాలు చేస్తున్నారు. వ్యాయామాల్లో చాలా సింపుల్‌గా ఉండే వ్యాయామం ఏదంటే వాకింగ్‌ అనే అందరూ చెబుతారు. వైద్యులు కూడా సులువైన వ్యాయామం వాకింగ్‌ అని.. మార్నింగ్‌ వాక్‌ చేస్తే.. సాధారణంగా అనారోగ్యాలకు దూరంగా ఉంటారని చెబుతారు. అయితే చాలామంది పొద్దున్నే కాలి నడకన వ్యాయామం చేస్తే.. ఇంకొందరు ట్రెడ్‌మిల్‌పై వాకింగ్‌ చేస్తారు. మరి అవుట్‌డోర్‌ వాకింగ్‌ లేక.. ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌నా..? వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది అనే సందేహానికి వైద్యుల ఏం చెబుతున్నారో తెలుసుకుందామా..!?

ట్రెడ్‌మిల్‌, అవుట్‌డోర్‌ వాకింగ్‌ ఈ రెండూ ఆరోగ్యానికి మంచివేనని వైద్యులు చెబుతున్నారు. అవుట్‌డోర్‌ వాకింగ్‌కి వెళ్లడం వల్ల..స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. ఈ గాలిని పీల్చుకోవడం వల్ల అనేక రకాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- సీజన్లనుబట్టి వాతావరణ మార్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే.. ఇంట్లోనే ఉండ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్‌ చేయడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. పట్టణ ప్రజలు ఉదయాన్నే ఫుట్‌పాత్‌లపై వాకింగ్‌ చేస్తారు. ఇంచుమించుగా ఫుట్‌పాత్‌ల వాకింగ్‌ మాదిరిగానే ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌ కూడా ఉంటుంది. అందుకే పట్టణవాసులకు ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌ మంచిదని వైద్యులు చెబుతున్నారు.