సౌరాష్ట్రకు ఆధిక్యత
రంజీట్రోఫీ సెమీఫైనల్స్
బెంగళూరు: కర్ణాటకతో జరుగుతున్న రంజీట్రోఫీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర జట్టు 527 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వసవాడ(202)డబుల్ సెంచరీకి తోడు చిరాగ్ జానీ(72) అర్ధసెంచరీతో రాణించారు. దీంతో ఆ జట్టుకు 120పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటకను కెప్టెన్ మయాంక్ అగర్వాల్(55) అర్ధసెంచరీతో రాణించాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి కేవలం 3 పరుగుల ఆధిక్యంలో ఉంది. నికిన్ జోస్(54) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మరో సెమీఫైనల్లో బెంగాల్ జట్టు మధ్యప్రదేశ్‌పై ఆధిక్యతను సంపాదించింది. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 9వికెట్లు నష్టపోయి 279 పరుగులు చేయడంతో 547 పరుగుల ఆధిక్యత లభించింది. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 279/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 438 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 170 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆఖరి రోజు ఫలితం రాని పక్షంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత ఆధారంగా ఫైనల్ బెర్త్‌లు ఖరారు కానున్నాయి.










