కోల్‌కతాపై ఏడు పరుగుల తేడాతో విజయం
మొహాలీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టు బోణీ కొట్టింది. శనివారం జరిగిఆన తొలి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఏడు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్‌పై గెలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 192పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో భాగంగా కోల్‌కతా 16ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు నష్టపోయి 146పరుగులు చేసింది. అనంతరం భారీ వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ గెలిచింది. మ్యాచ్ నిలిచే సమయానికి కోట్‌కతా జట్టు 24బంతుల్లో 46పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజ్‌లో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు. కోల్‌కతా బ్యాటర్లలో ఇంప్యాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(34) విధ్వంసక ప్లేయర్ అండ్రూ రస్సెల్(35) నితీశ్ రానా(24) మాత్రమే రాణించారు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగట్టాడు. సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, సికిందర్ రజా, రాహుల్ చహర్ తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆర్ష్‌దీప్ సింగ్‌కు లభించింది.
రాజపక్సే హాఫ్ సెంచరీ
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 191 పరుగులు చేసింది. భానుక రాజపక్సే (50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శిఖర్ ధావన్(40), ఓపెనర్ ప్రభ్‌సింV్‌ా రానా సింగ్ (23) వికెట్ కీపర్ జితేశ్ శర్మ(21), సికిందర్ రజా (16) రాణించారు. ఆఖర్లో ఆల్‌రౌండర్ సామ్ కరన్(26), షారుఖ్ ఖాన్(11) దంచి కొట్టడంతో పంజాబ్ 191 రన్స్ చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండో వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అర్ష్‌దీప్ దెబ్బకు..
అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు కేకేఆర్ ఓకే ఓవర్‌లో రెండో వికెట్లు కోల్పోయింది. అనుకుల్ రారు (4), మన్‌దీప్ సింగ్ (2) ఔటయ్యారు. ఆ తర్వాత నితీశ్ రానా, గుర్బాజ్ తక్కువకే ఔటయ్యారు. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను అండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ అదుకున్నారు. వీళ్లు వీళ్లు ఆరో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, నరైన్ వేగంగా ఆడారు. కానీ, వర్షం పడడంతో మ్యాచ్ కోల్‌కతా చేజారింది.
మొహాలీలో వర్షం... డీఎల్‌ఎస్ పద్ధతిలో పంజాబ్ కింగ్స్ విజయం
మొహాలీలో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
కోల్ కతా లక్ష్యఛేదనలో వర్షం కురిసిన వైనం
నిలిచిపోయిన మ్యాచ్
డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ 7 రన్స్ తేడాతో విజయం
మొహాలీలో భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డీఎల్‌ఎస్ పద్ధతిలో విజేతను తేల్చారు.
స్కోర్‌బోర్డు..
పంజాబ్‌కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభుసిమ్రన్ (సి)గుర్బాజ్ (బి)సౌథీ 23, ధావన్ (సి)వరణ్ చక్రవర్తి 40, రాజపక్సే (సి)రిక్కీ సింగ్ (బి)ఉమేశ్ 50, జితేశ్ శర్మ (సి)ఉమేశ్ (బి)సౌథీ 21, హసన్ రాజా (సి)నితీశ్ రాణా (బి)నరైన్ 16, సామ్ కర్రన్ (నాటౌట్) 26, షారుక్ ఖాన్ (నాటౌట్) 11, అదనం 4. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 191పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/109, 3/135, 4/143, 5/168
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4-0-27-1, సౌథీ 4-0-54-2, నరైన్ 4-0-40-1, వరణ్ చక్రవర్తి 4-0-26-1, శార్దూల్ ఠాకూర్ 4-0-43-0,
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మన్‌దీప్ సింగ్ (సి)సామ్ కర్రన్ (బి)ఆర్ష్‌దీప్ 2, గుర్బాజ్ (సి)ఎల్లిస్ 22, అనుకుల్ రారు (సి)రాజా (బి)ఆర్ష్‌దీప్ 4, వెంకటేశ్ అయ్యర్ (సి)రాహుల్ చాహర్ (బి)ఆర్ష్‌దీప్ 34, నితీశ్ రాణా (సి)రాహుల్ చాహర్ (బి)రాజా 24, రింకూ సింగ్ (సి)రాజా (బి)రాహుల్ చాహర్ 5, ఆండీ రస్సెల్ (సి)రాజా (బి)శామ్ కర్రన్ 35, శార్దూల్ ఠాకూర్ (నాటౌట్) 8, సునీల్ నరైన్ (నాటౌట్) 7, అదనం 6. (16ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 146పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/17, 3/29, 4/75, 5/80, 6/130, 7/138
బౌలింగ్: సామ్ కర్రన్ 3-0-38-1, ఆర్ష్‌దీప్ సింగ్ 3-0-19-3, నాథన్ ఎల్లీస్ 3-0-27-1, సికిందర్ రాజా 3-0-25-1, రిషీ ధావన్ 1-0-15-0, రాహుల్ చాహర్ 2-0-12-1, హర్‌ప్రీత్ బ్రార్ 1-0-7-0










