శాన్‌ఫ్రాన్సిస్కో : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోని పలు వస్తువులను వేలం వేస్తోన్నారు. ఎలన్ మస్క్ ఈ సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత ట్విట్టర్ ఆర్థిక కష్టాలు ఎక్కువయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంస్థలోని ఖరీదైన ఫర్నీచర్, కంప్యూటర్లు,, కిచెన్ ఉత్పత్తులు, నీలి రంగులో ఉండే కంపెనీ లోగో బొమ్మ సహా ఎన్95 మాస్క్‌ల వంద బాక్స్‌లను కూడా వేలానికి ఉంచారని రిపోర్టులు వస్తున్నాయి. దాదాపు 631 వస్తువులను వేలంలో అమ్మకానికి పెట్టింది. ట్విట్టర్ ఇటీవల అనేక కార్యలయాల అద్దెలు కూడా చెల్లించలేకపోతుందని సమాచారం. ఎలన్ మస్క్ బాధ్యతలను తీసుకున్న తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని హార్టఫోర్డ్ బిల్డింగ్‌లోని ట్విటర్ ప్రధాన కార్యాలయం అద్దెను చెల్లించకపోవడంతో ఆ భవన యాజమాన్య సంస్థ ఇప్పటికే కోర్టులో దావా వేసింది.










