శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌లో చెల్లింపుల సర్వీసు అయినా బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ నమోదు అప్షన్ కనిపించట్లేదని అంతర్జాతీయ ఆంగ్ల మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వల్ల నకిలీ ఖాతాలు ఎక్కువగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును ఆపేసినట్లు సమాచారం. ఈ సర్వీసును పొందాలనుకునే వారికి 8 డాలర్లు ఛార్జ్ చేయాలని ట్విట్టర్ చీఫ్ ఎలన్ మస్క్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి భారత్‌లోనూ ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి వాటికి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారని ట్విట్టర్ దృష్టికి రావడంతో సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.










