Jun 14,2022 12:28

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ (బాపట్ల) : మార్టూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 4 ఎకరాల చాకలి మాన్యం స్థలం విషయంలో కొంతకాలంగా అగ్రవర్ణాలకు, రజకులకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మంగళవారం వేకువజామున అగ్రవర్ణాలు కిరాయి రౌడీలను పంపి నిద్రపోతున్న రజకులపై విచక్షణారహితంగా దాడి చేయించారు. చాకలి మాన్యం స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ రజకులపై రౌడీలు రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకొల్లు సిఐ ఆధ్వర్యంలో మార్టూరు, యద్దనపూడి, పంగులూరు, ఇంకొల్లు ఎస్‌ఐలు రంగంలోకి దిగారు. పరిస్థితిని సద్దుమణిగించారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.