Oct 12,2023 12:38

హనుమకొండ :హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. నిందితుడు కానిస్టేబుల్‌ ప్రసాద్‌ కోటపల్లి పీఎస్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న మృతురాలు కమలమ్మను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.