Jun 17,2023 16:30

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బాబర్‌ ఆజం సారధ్యంలో తమ జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు శనివారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌ 2023-25లో భాగంగా జరగనుంది. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కానుంది. బాబర్‌ ఆజాం నేతత్వంలోని పాక్‌ జట్టు జులై 9న శ్రీలంకకు పయనం కానున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నుంచి టెస్టు జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది.. శ్రీలంక సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ ఆటగాళ్లు ముహమ్మద్‌ హురైరా,అమీర్‌ జమాల్‌కు తొలి సారి పాకిస్తాన్‌ టెస్టు జట్టులో చోటుదక్కింది. శ్రీలంక సిరీస్‌తో వీరిద్దిరూ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
పాకిస్తాన్‌ జట్టు: బాబర్‌ అజాం (కెప్టెన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), అమీర్‌ జమాల్‌, అబ్దుల్లా షఫీక్‌, అబ్రార్‌ అహ్మద్‌, హసన్‌ అలీ, ఇమామ్‌-ఉల్‌-హక్‌, మహ్మద్‌ హురైరా, మొహమ్మద్‌ నవాజ్‌, నసీమ్‌ షా, నోమన్‌ అలీ, సల్మాన్‌ అలీ అఘా, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సౌద్‌ షకీల్‌, షాహీన్‌ అఫ్రిది,షాన్‌ మసూద్‌.