ముంబయి : ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడో సేవలను నిలిపివేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో ద్విచక్ర, త్రిచక్ర ట్యాక్సీలను నడిపేందుకు లైసెన్స్ ఇవ్వడానికి పూణె రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్‌డిఒ) నిరాకరించింది. దీనిపై రాపిడో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం పుణె ఆర్‌డిఒ ఆదేశాలను తప్పుపట్టలేమని పేర్కొంది. మహారాష్ట్రలో కార్యకలాపాలు నిలిపేయాలని రాపిడో యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శకాలకు వ్యతిరేకంగా, లైసెన్స్ లేకుండా ట్యాక్సీలను నడుపొచ్చనే రాపిడో వాదనల్లో అర్థం లేదని కోర్టు పేర్కొంది.










