Jan 18,2023 20:53

న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కారు నెక్సాన్‌ ఇవి ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెక్సాన్‌ ఇవి ఫ్రైమ్‌, నెక్సాన్‌ ఇవి మాక్స్‌ కార్లపై రూ.50 వేల వరకు తగ్గింపును ఇస్తున్నట్లు బుధవారం ఆ సంస్థ తెలిపింది, ఆయా వేరియంట్ల ఆధారంగా ధరల తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఇవి ఫ్రైమ్‌, ఇవి మాక్స్‌ ఎక్స్‌్‌షోరూం ధరలు రూ.14.49 లక్షల నుంచి 16.99 లక్షల శ్రేణీలో ఉన్నాయి. నెక్సాన్‌ ఇవి మ్యాక్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 453 ప్రయాణించగలదని ఆ సంస్థ తెలిపింది.