Jun 24,2023 14:57
  •  ఒకదాని తర్వాత మరొకటి కల్వర్టును ఢీకొన్న కార్లు

ప్రజాశక్తి - తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌ వినాయక గుడి వద్ద రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అదుపు తప్పి పక్కనున్న కల్వర్టును రెండు కార్లు ఢీ కొన్నాయి. మొదట జరిగిన ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీశారు. ఆ తర్వాత మరో ప్రమాదంలో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.