Jan 13,2023 21:21

హైదరాబాద్‌ : గతేడాది దక్షిణాది ప్రాంతంలోని ఐదు లక్షలకు పైచిలుకు రోగులతో ముఖాముఖి మార్క్‌ను చేరుకున్నట్లు ప్రిస్టిన్‌ కేర్‌ వెల్లడించింది. 2023లో ఈ సంఖ్య రెట్టింపునకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సంప్రదింపులలో ఎక్కువ భాగం ప్రాక్టాలజీ యూరాలజీ, ఈస్టటిక్స్‌క్స్‌కు సంబంధించినవేనని పేర్కొంది. డిసెంబర్‌ చివరి నాటికి దక్షిణాదిలోని 300 ఆసుపత్రులు, 100 క్లినిక్‌లకు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ ఇటీవల పేర్కొంది.