గుంటూరు : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ... బుధవారం గుంటూరులోని పలుచోట్ల టిడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన పెద్దకూరపాడులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద టిడిపి కార్యకర్తలు, నాయకులు నల్ల కండువాలు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. టిడిపి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో టిడిపి నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు.