May 23,2023 12:34

ప్రజాశక్తి - నందిగామ (ఎన్‌టిఆర్‌) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్‌ విధానాలకు వ్యతిరేకంగా ... నందిగామ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చందాపురం సబ్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య , నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు , మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు వీరంకి వీరస్వామి, ఏచూరి రాము, కొంగర మోహన మూర్తి, వడ్డెల్లి సాంబశివరావు తదితర దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.