సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విదేశీ స్టార్ ఆటగాళ్లు ఎక్కువమందే ఉన్నారు. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో తొలిసారి టైటిల్‌ను సాధించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత సీజన్‌లలో ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఇటీవలికాలంలో సన్‌రైజర్స్ జట్టు ప్లే-ఆఫ్‌కు చేరడంలో విఫలమౌతోంది. 2022 సీజన్‌కు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఈసారి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడేన్ మార్క్రరమ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతని సారథ్యంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ ప్రిమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ కేవలం 6మ్యాచుల్లో గెలిచి 8మ్యాచుల్లో ఓటమిపాలైంది. మినీ వేలంలో హారీ బ్రూక్స్, కేమరన్ గ్రీన్‌తోపాటు మయాంక్ అగర్వాల్ అద్భుత ఫామ్‌లో ఉండడం కలిసారనుంది. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు యువ క్రికెటర్ ఉమ్రన్ మాలిక్, టి. నటరాజన్ అందుబాటులోకి వచ్చారు.










