ఇంటర్నెట్డెస్క్ : ఇటీవలి కలంలో గుండెపోటుకి గురయ్యే వారి సంఖ్య పెరిగింది. గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల తక్కువ వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. అయితే హృద్రోగ సమస్యల్ని ఎదుర్కొన్నవారు.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఒకవళ చేసినా.. ఆ ప్రభావం గుండె పనితీరుపై పడి భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందేమోనని చాలామంది రోగులు ఆందోళన చెందుతున్నారు. అటువంటి ఆందోళనలు దరిచేరకుండా.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే గుండె సమస్యల్ని నివారించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
- రోజూ వ్యాయామం చేస్తే అనారోగ్య సమస్యలు తక్కువగా గురవుతారని వైద్యులు సూచిస్తారు. అయితే వ్యాయామం చేసినా.. ఇటీవలి కాలంలో హృద్రోగ సమస్యలకు ఎక్కువమందే గురవుతున్నారు. గుండెనొప్పికి గురైన తర్వాత భయాందోళనలతో చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు. అయితే వ్యాయామం చేయకపోవడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
- గుండెనొప్పికి గురైన తర్వాత కూడా వ్యాయామం చేస్తే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వాకింగ్ చేస్తే కాలి కండరాలు బలోపేతమై గుండె ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. అయితే గుండెనొప్పి సమస్య ఎదుర్కొన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలన్నది వైద్యుల సూచన మేరకే చేయాలి.