కడప : జగనన్న కాలనీలో అక్రమ కట్టడాలను ఆపాలంటూ... రామేశ్వరం జగనన్న కాలనీ సమీప గ్రామస్తులు కోరారు. సోమవారం వారు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని రామేశ్వరం జగనన్న కాలనీలో అక్రమ కట్టడాలు చేపట్టారు. రామేశ్వర గ్రామానికి సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే జగనన్న కాలనీ ఉండటంతో పోరుమామిళ్ల కు చెందిన వ్యక్తి అక్రమ కట్టడాలు నిర్మించడం కోసం సిమెంట్ దిమ్మెలు, సిమెంటు సమకూర్చుకొని, బేస్ మట్టం సాలు తీయడం ప్రారంభించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి అక్రమ కట్టడాలు ఎందుకు చేపడుతున్నావని సదరు వ్యక్తిని అడగగా గ్రామంలోని కొందరు వ్యక్తులు తనను కట్టడాలు కట్టుకోవడానికి అనుమతించారని తెలియజేశారు. అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.










