Jun 09,2023 22:15

జైపూర్‌: ప్రిమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ జైపూర్‌లోని సవారు మన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో గురువారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ప్రారంభ సీజన్‌లో మొత్తం ఆరుజట్లు బరిలోకి దిగాయి. ఢిల్లీ పంజర్స్‌, రాజస్తాన్‌ పట్రోటియస్‌, గర్విత్‌ గుజరాత్‌, గోల్డెన్‌ ఈగిల్‌ ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్ర ఐరన్‌మెన్‌, తెలుగు టలోన్స్‌ జట్లు టైటిల్‌కై తలపడనున్నాయి. కొత్త రూల్స్‌తో హ్యాండ్‌బాల్‌ లీగ్‌ ప్రారంభమైనట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు టలోన్స్‌ జట్టు: ఆండ్రీ ఇగోరెవిచ్‌ నెడ్‌బైలో, ఇయరోస్లావ్‌ అలెగ్జాండ్రోవిచ్‌ షబానోవ్‌, రే జాషువా టబుజో, నసీబ్‌ సింగ్‌, అనిల్‌ ఖుడియా, శుభమ్‌ షెరాన్‌, కైలాష్‌ పటేల్‌, రాహుల్‌ టికె, రఘు కుమార, మోహిత్‌ కుమార్‌, చిరాగ్‌ చందేల్‌, విశాల్‌ హడియా, మోహిత్‌ మొహిత్‌ భుల్లార్‌, సోంబ్‌ భుల్లార్‌, ఎ. రాహుల్‌ నైన్‌
రూల్స్‌..
- కోర్టును 40మీ.×20మీ.కు కుదించారు.
- గోల్‌ పోస్ట్‌ సైజ్‌ను 2మీ. × 3మీ. చేశారు.
- గోల్‌ పోస్ట్‌లోకి బంతి వెల్లడమే ముఖ్యం
- మోకాలి క్రింది భాగంలో బంతి తగిలితే ఫౌల్‌..
- ప్రతి గోల్‌ చుట్టూ 6మీ. (20అడుగులు) జోన్‌ ఉంటుంది. డిఫెండింగ్‌ గోల్‌కీపర్‌కు మాత్రమే అనుమతి.
- గోల్‌ చేసే ఆటగాడు ఈ జోన్‌ వెలుపలనుంచి చేయాలి.
- మొత్తం 60నిమిషాల మ్యాచ్‌ను 30 + 30గా రెండు అర్ధభాగాలుగా విభజించారు.
- ప్రతి జట్టులో ఏడుగురు సభ్యులు ఉండాలి(ఆరుగురు ఔట్‌ఫీల్‌, ఒక గోల్‌ కీపర్‌ తప్పనిసరి)
ఫార్మాట్‌...
- 6జట్లు మొత్తం 30మ్యాచ్‌లు ఆడనున్నాయి.
- ప్రతి జట్టు ప్రత్యర్ధి జట్టుతో రెండేసిసార్లు తలపడనుంది.
- లీగ్‌ దశ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన 4జట్లు సెమీస్‌ ఆడతాయి.
- 2టీములు ఫైనల్లో టైటిల్‌కు తలపడతాయి.
- తొలి సీజన్‌లో 33మ్యాచ్‌లు (30లీగ్‌ మ్యాచ్‌లు 3 నాకౌట్‌ మ్యాచ్‌లు)
- జూన్‌ 24న సెమీస్‌, 25న ఫైనల్‌ మ్యాచ్‌.