- ఎగువ, దిగువ కాఫర్ డ్యాము మధ్య సీఫేజీ జలాలు
ప్రజాశక్తి - పోలవరం : పోలవరం ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల నడుమ జరుగుతున్న ఇసుక డంపింగ్, డయా ఫ్రంవాల్ ప్రాంతంలో అగాధాల పూడ్చివేత, వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల నడుమ సీఫేజీ జలాల నీటిమట్టం పెరగడంతో పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఆగినా... వరద ప్రభావం లేని ప్రాంతాల్లో పనులు సజావుగానే కొనసాగుతాయని పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఇ నరసింహమూర్తి తెలిపారు. పోలవరం నుండి 9,36,296 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఇఇ పి.వెంకటరమణ పేర్కొన్నారు.










