Jun 08,2023 22:00

సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ సూపర్‌750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌ 15-21, 19-21తో ఛియా-హో-లీ(చైనీస్‌ తైపీ) చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఈ మ్యాచ్‌ 37 నిమిషాల్లోనే ముగిసినా.. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌ పోరాడి ఓడాడు. మరో సింగిల్స్‌ పోటీలో ప్రియాంశు రాజవత్‌ 17-21, 16-21తో 3వ సీడ్‌ నరోకా(జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. తనకంటే మెరుగైన ర్యాంక్‌ కలిగిన ఛియావోకు ప్రియాంశు ముచ్చెమటలు పట్టించాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌ాధృవ్‌ కపిల జోడీ 15-21, 17-21తో అమెరికాకు చెందిన 3వ సీడ్‌ అరోన్‌ ఛియాాషోక్‌ వుల్‌ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.