Mar 29,2023 10:35

క్రైస్ట్‌చర్చ్‌ : న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో శ్రీలంక వన్డే ప్రపంచకప్‌ ఆశలు అడియాశలయ్యాయి. భారత్‌ వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు నేరుగా బెర్త్‌ దక్కించుకోవాలంటే న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ను గెలుపొందాల్సి ఉంది. ఈ క్రమంలో శ్రీలంక జట్టు తొలి వన్డేలో 198పరుగుల తేడాతో ఓటమిపాలుకాగా.. మంగళవారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో శ్రీలంక జట్టు వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. ఐసిసి వన్డే టాప్‌-8 ర్యాంకుల్లో ఉన్నట్లు జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు స్థానాల కోసం టోర్నీకి ముందు అర్హత పోటీ జరగనుంది. శ్రీలంక జట్టు స్థానంలో వెస్టిండీస్‌ జట్టు ఎనిమిదో స్థానంలో నిలువగా.. శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. 1996లో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలిచిన శ్రీలంక.. 2011లో రన్నరప్‌గా నిలిచింది.

వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు : 
(1) న్యూజిలాండ్‌ (2) ఇంగ్లండ్‌
(3) భారత్‌ (4) బంగ్లాదేశ్‌ (5) పాకిస్థాన్‌ (6) ఆస్ట్రేలియా
(7) అఫ్గనిస్థాన్‌ (8) వెస్టిండీస్‌