Jan 21,2023 20:43

భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాం
ఆ సంస్థ జెఎండి ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్‌ :
ప్రముఖ పర్యాటక, అతిథ్య రంగ సేవలను అందించే సదరన్‌ ట్రావెల్స్‌ పలు రాష్ట్రాల్లో హాలీడే మార్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటకులకు మరింత చేరువ కావడానికి భారీ డిస్కౌంట్లతో దేశంలోని వివిధ నగరాలలో ఈ నెల 23 వ తేదీ నుంచి ఈ క్యాంపెయిన్‌ను చేపడుతున్నామని ఆ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎవి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన ఆ సంస్థ డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎం రామా రావుతో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించి.. మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రాజమండ్రీ, వైజాగ్‌, విజయవాడ నగరాల్లో ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 5వరకు హాలీడే మార్ట్‌-2023ను నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 27 నుంచి 29 తేదిల్లో శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, కర్నూల్‌లో క్యాంపెయిన్‌ ఉంటుందని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. టూర్‌ బుకింగ్‌లపై వెండి నాణెం గెలుచుకొనే అవకాశం, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, అంతర్జాతీయ హాలిడే టూర్ల బుకింగ్స్‌ పై దేశీయ హాలిడే టూర్లను ఉచితంగా అందించడంతో పాటు లక్కీడ్రాలపై ఎన్నో బహుమతులను ఇస్తున్నామన్నారు. కరోనా సంక్షోభం తర్వాత రెండేళ్ల అనంతరం ఈ ఏడాది తిరిగి ఈ క్యాంపెయిన్‌ చేపడుతున్నామన్నారు. తమ సంస్థ పర్యాటకులకు ఏకంగా 540 ప్యాకేజీలను అందిస్తుందన్నారు. హాలీడే మర్ట్‌కు వెళ్లలేని ఔత్సాహికులు ఆన్‌లైన్‌లోనూ తమ స్లాట్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్‌ రావు, బి శ్రీనివాస్‌ గుప్తా పాల్గొన్నారు.