Apr 01,2023 21:35

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌300 మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి పివి సింధు ప్రవేశించింది. శనివారం జరిగిన ఉత్కంఠ పోటీలో సింధు 24-22, 22-20పాయింట్ల తేడాతో హోాజియోామిన్‌(సింగపూర్‌)పై గెలిచింది. తొలి గేమ్‌లో ఇరువురు షట్లర్లు హోరాహోరీగా తలపడగా.. చివర్లో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను ముగించింది. బిడబ్ల్యుఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ స్థానంలో, హో-జియొామింగ్‌ 33వ స్థానంలో ఉన్నారు. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు కరోలినా మారిన్‌-టన్‌జంగ్‌ మ్యాచ్‌ విజేతతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి జపాన్‌కు చెందిన నిషిమోటో ప్రవేశించాడు. సెమీస్‌లో నిషీమోటో 21-10, 15-21, 23-21తో పొపోవ్‌(ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. మరో సెమీస్‌ ఆంటోన్సెన్‌(డెన్మార్క్‌), సునేయమా(జపాన్‌)ల మధ్య జరగనుంది.