స్పెయిన్ మాస్టర్స్ సూపర్300 బ్యాడ్మింటన్ టోర్నీ
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ సూపర్300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి పివి సింధు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-14, 21-17తో డెన్మార్క్‌కు చెందిన బ్లిచ్‌ఫిడ్ట్‌పై నెగ్గింది. బిడబ్ల్యుఎప్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానానికి పడిపోయిన సింధు.. 19వ ర్యాంకర్‌పై వరుససెట్లలో నెగ్గింది. రెండో గేమ్‌లో సింధు ఓ దశలో 12-6పాయింట్ల ఆధిక్యతలో నిలిచినా.. చివర్లో డెన్మార్క్ షట్లర్ పుంజుకొని సింధుకు గట్టిపోటీనిచ్చింది. సెమీస్‌లో సింధు.. బియాంగ్ జంగ్(అమెరికా)-యోా జియాా మిన్ (సింగపూర్) మ్యాచ్‌ల విజేతతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 15-21తో టాప్‌సీడ్ కెంటా నిషీమోటో(జపాన్) చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూసింది.










