Mar 30,2023 22:02

స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌300
మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 21-12తో భారత్‌కే చెందిన బి. సాయి ప్రణీత్‌పై వరుససెట్లలో గెలిచాడు. క్వార్టర్స్‌లో 5వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ టాప్‌సీడ్‌ జపాన్‌కు చెందిన నిషీమోటోతో తలపడనున్నాడు. ఇతర పోటీల్లో కిరణ్‌ జార్జి 16-21, 14-21తో డెన్మార్క్‌కు చెందిన జన్నాసెన్‌ చేతిలో, ప్రియాంశు 21-18, 16-21, 11-21తో 8వ సీడ్‌ పొపోవ్‌(ఫ్రాన్స్‌) చేతిలో ఓడారు. మరో ఉత్కంఠ పోటీలో సమీర్‌ వర్మ 9-21, 21-14, 17-21తో జపాన్‌కు చెందిన 2వ సీడ్‌ సునేయమా చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 21-10, 21-14తో ఇండోనేషియాకు చెందిన వర్డానీపై వరుససెట్లలో విజయం సాధించింది.