ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్-2023తో అదరగొట్టాడు. స్విమ్మింగ్ వివిధ కేటగిరీల్లో, మహారాష్ట్ర తరఫున ప్రాతినిధ్యం వహించిన వేదాంత్ మొత్తం 7స్వర్ణాలతో అదరగొట్టాడు. దీంతో సినీ హీరో మాధవన్ కొడుకు వేదాంత్ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతూ.. మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్‌లు చేశాడు. వేదాంత్, ఫెర్నాండెస్ అపేక్ష (6 గోల్డ్, 1 సిల్వర్) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కఅషి చేసిన కోచ్ ప్రదీప్ సర్, చౌహాన్ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి కఅతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్ చేశాడు. కాగా, గతేడాది డానిష్ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్ తొలిసారి వార్తల్లోకెక్కాడు.










