Nov 05,2022 20:42

హైదరాబాద్‌ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ విప్రో కన్స్యూమర్‌ కేర్‌ తన 'సంతూర్‌ అరేంజ్‌' సబ్బును తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 'యవ్వనంగా ఆలోచించండి' అనే నినాధంతో సరికొత్తగా తమ యువ వినియోగదారులను కనెక్ట్‌ కావాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. కొత్త ప్యాకేజింగ్‌, మెరుగుపడ్డ సువాసన, ఉత్తమమైన తేమదనంతో దీన్ని ఆవిష్కరించినట్లు విప్రో కన్య్సూమర్‌ కేర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీరజ్‌ ఖత్రి తెలిపారు. 100 గ్రాముల సబ్బు ధరను రూ.36గా నిర్ణయించింది.