Jun 05,2023 22:00

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి 4వ సీడ్‌ కాస్పెర్‌ రూఢ్‌ ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో నార్వేకు చెందిన రూఢ్‌ 7-6(7-3), 7-5, 7-5తో నికోలస్‌ జర్రీ(చిలీ)పై వరుససెట్లలో నెగ్గాడు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో చేజిక్కించుకున్న రూఢ్‌.. రెండు, మూడు సెట్‌లు గెలిచేందుకు పోరాడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌ సుమారు 3గంటల 20నిమిషాలసేపు సాగించింది. క్వార్టర్‌ఫైనల్లో రూఢ్‌.. 6వ సీడ్‌ హోల్జర్‌ రూనే, సెరెండులో మ్యాచ్‌ విజేతతో తలపడనున్నాడు.

Rudd-advances-to-French-Open-Grand-Slam-quarters


ఇక మహిళల సింగిల్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ట్యునీషియాకు చెందిన 7వ సీడ్‌ ఓన్స్‌ జబీర్‌ ప్రవేశించింది. ప్రి క్వార్టర్స్‌లో జబీర్‌ 6-3, 6-1తో పెరా(అమెరికా)పై సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌ సుమారు గంటా 3నిమిషాలసేపు సాగింది. మరో పోటీలో 14వ సీడ్‌, దక్షిణాఫ్రికాకు చెందిన హడ్డాడ్‌ మలా ప్రవేశించింది. ప్రి క్వార్టర్స్‌లో మలా 6-7(3-7), 6-3, 7-5తో సొమిబెస్‌ టొర్మో(స్పెయిన్‌)పై పోరాడి నెగ్గింది. ఈ మ్యాచ్‌ సుమారు 3గంటల 51నిమిషాలసేపు సాగింది.